Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ.. Telangana Government Lands Distribution: తెలంగాణలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి చేపట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 30 వేల మందికి స్థలాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో 20 వేల మందికి రానున్న 10 రోజుల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది. By Shiva.K 22 Sep 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Government Lands Distribution: తెలంగాణలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి చేపట్టనుంది ప్రభుత్వం(Telangana Government). ఇప్పటికే దాదాపు 30 వేల మందికి స్థలాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో 20 వేల మందికి రానున్న 10 రోజుల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు తమకంటూ ఓ సొంత ఇల్లు(Govt Lands) ఉండాలని అనుకుంటారు. ఇలాంటి వారి కలలను నిజం చేసేందుకు, పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తోంది. ఈమేరకు స్థానిక అధికారులను కూడా ఆదేశించింది ప్రభుత్వం. మరోవైపు.. ఈ స్థలాల పంపిణీకి సంబంధించి.. ఆయనా మండలాల వారీగా తహసీల్దార్లు అర్హులైన వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం సేకరించిన భూముల్లోనే పేదలకు స్థలాలు పంచిపెట్టనుంది. పేదలకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం గతంలోనే భూములను గుర్తించింది. అందులో కొందరికి పట్టాలు పంపిణీ చేయగా.. మిగతా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. దాంతో ఆ స్థలాలు అలాగే ఖాళీగా ఉండిపోయాయి. ఇప్పుడు గతంలో సేకరించిన స్థలాలనే స్థానికంగా ఇల్లు లేని వారికి కేటాయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. 75 గజాల చొప్పున ఆ స్థలాలను ప్రజలకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇకపోతే, లబ్ధిదారుల కన్నా స్థలాల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ప్లాట్ల కేటాయింపు వ్యవహారాన్ని ఎమ్మెల్యేలే చూసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. వారు సూచించిన వారికే అధికారులు ప్లాట్స్ కేటాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. Also Read: Telangana: పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు: మంత్రి కేటీఆర్ Women Reservation Bill : నారీ శక్తికి జయహో…రాజ్యసభలోనూ బిల్లు పాస్.!! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి