TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?

తెలంగాణకు సంక్షిప్త పదంగా TS కు బదులుగా TG అని వాడాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థ TSSPDCL పేరును TGSPDCLగా మార్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ (TSPSC) పేరును TGPSCగా త్వరలో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?

TSPSC Board To Rename AS TGPSC: తెలంగాణ రాష్ట్రానికి బదులుగా సంక్షిప్తపదంగా ఇప్పటి వరకు వాడుతున్న టీఎస్ (TS)కు బదులుగా టీజీ (TG) వాడాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలసిందే. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు ఇక మీదట టీజీకి బదులుగా.. టీఎస్ అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో ఇక మీదట టీజీ బదులుగా టీఎస్ నే వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

దీంతో అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీకి బదులుగా టీఎస్ ను రాస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).. పేరును టీఎస్ఎస్పీడీసీఎల్ గా (TGSPDCL) మార్చారు. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేరును కూడా ప్రభుత్వం త్వరలో మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిని TGPSCగా మార్చనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు