/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/enc-removed-jpg.webp)
తెలంగాణ(Telangana) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ రావును వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. పదవీ విరమణ తర్వాత ఆయన పొడిగింపులో ఉన్నారు. నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో రాష్ట్ర నీటి భాగస్వామ్యం, నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన సమావేశంలో మురళీధర్ రావు తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆరు రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అటు మరికొందరు ఇంజనీర్లపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక, కేఆర్ఎంబీ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో మురళీధర్.. 11 ఏళ్లకు పైగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్‌సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేసిన విషయం తెలిసిందే.
Also Read: టీఎస్ పీఎస్సీకి 40కోట్లు నిధులు..ఉద్యోగాల భర్తీకి కసరత్తులు షురూ..!!