Hydra: రేవంత్ సర్కార్ మరో మార్క్... హైడ్రాకు కీలక బాధ్యతలు!

హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాల సమీపంలోని నూతన భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం.

author-image
By V.J Reddy
New Update
HYDRA

Hydra: అక్రమ కట్టడాల భరతం పడుతున్న హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలోనూ హైడ్రాకు భాగస్వామ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా కార్యాచరణను మొదలు పెట్టింది. చెరువులు, నాలాల సమీపంలోని భవనాలకు హైడ్రా అధికారుల అనుమతులు తప్పనిసరి కానున్నట్లు ప్రభుత్వ యంత్రంగాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్లా, కరెంట్ కనెక్షన్లు బంద్ చేయనున్నారు అధికారులు. భవన నిర్మాణ నిబంధనల సవరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో జనాల్లో గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్టు సరైందో తెలియక అయోమయం ప్రజలు ఉన్నారు. కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకే నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాకు భాగస్వామ్యం కావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మూడు విభాగాలుగా..

హైడ్రా మరింత బలోపేతం అయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితం అయిన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా సెంట్రల్‌ జోన్‌గా హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌, నార్త్‌ జోన్‌గా సైబరాబాద్‌, సౌత్‌ జోన్‌గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.

Advertisment
తాజా కథనాలు