Gaddar Statue in Tellapur: బడుగు వర్గాల ఆశాదీపం ..ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఇటీవల అఖిలపక్షం నాయకులు ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు సన్నాహాలు చేస్తుండగా గద్దర్ వ్యతిరేక వ్యక్తులు,హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు ఆ పనులు జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచిపోవడంతో పలు సంఘాలు ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ (Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ :గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్
తుదిశ్వాశ వరకు పోరు బాటలోనే
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేందుకు తన గళంతో ఎన్నో పాటలు పాడి జనంలో చైతన్యాన్ని నింపిన గద్దర్ (Gaddar) తన చివరి శ్వాస వరకు ప్రజల్లో చైతన్యం నింపేందుకే శ్రమించాడు. ఎన్నో పోరాటాలు చేసి అణగారిన బతుకుల్లో ఆశా జ్యోతిగా నిలిచేందుకు రాజకీయ పార్టీని సైతం పెట్టి రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసేందుకు కలలుగని ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తుదిశ్వాశ వరకు పోరు బాటలోనే కొనసాగిన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ గద్దర్ కుమార్తె వెన్నెల రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రేస్ పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది.
ALSO READ :హెటిరోకు రేవంత్ సర్కార్ షాక్.. ఆ జీవో రద్దు