Telangana: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలో అంగన్‌వాడీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున అందివ్వాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది.
Also Read: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!
హైదరాబాద్ రహమత్‌నగర్‌లో ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ అందిస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్ ఇస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు.