CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా?

ఏసీబీ చీఫ్ గా అవినీతి అధికారులను వేటాడి పట్టుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోసారి ఆయన హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ పై స్పెషల్ స్టోరీ..

CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా?
New Update

ఠాగూర్‌ సినిమా గుర్తింది కదా..? లంచగొండుల గుండెలో నిదురించిన సింహంలా మెప్పించిన చిరంజీవి బాక్సాఫిస్‌ వద్ద సెన్సెషన్‌ క్రియేట్ చేశాడు. అయితే అదంతా సినిమా.. కానీ రియల్‌ లైఫ్‌లోనూ ఓ ఠాగూర్‌ ఉన్నారు. అది కూడా మన తెలంగాణలోనే..! లంచాలు తీసుకుంటున్నవారి భరతం పడుతున్నారాయన. తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ దెబ్బకు లంచగొండు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లంచాలు తీసుకోవాలంటేనే ప్రభుత్వ అధికారులు హడలిపోయారు. నిత్యం ఎక్కడో ఒక చోటా బడా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కుతుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ లంచం…అదే స‌గ‌టు భార‌తీయుడి ఆవేద‌న‌.. అదే సీవీ ఆనంద్‌ ఆవేదన కూడా.. అవినీతిని అంతం చేసేందుకు ఆయన ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. అందుకే ఏసీబీ ద్వారా లంచగొండుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు. నిజానికి ప్రజల్లో ఏసీబీ పట్ల ఒక అభిప్రాయం ఉంది. ఏసీబీ కేవలం చిన్నచిన్న ప్రభుత్వ అధికారులనే పట్టుకుంటుందని.. పెద్ద పెద్ద తిమింగలాలను పట్టించుకోదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇదంతా రాంగ్‌ అని ప్రూవ్‌ చేశారు సీవీ ఆనంద్. ఏసీబీ వలలో చిక్కుతున్న లంచగొండు అధికారుల్లో దాదాపు అన్ని పెద్దచేపలే కనిపిస్తున్నాయి.

5 వేలు, 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ అధికారుల గురించి వింటూ వస్తున్న జనాలకు చాలా రోజులుగా లక్షలు రూపాయలు తీసుకుంటూ దొరుకుతున్న అధికారులను కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏసీబీని తెగ మెచ్చుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లంచం తీసుకున్న అధికారులు ఆ డబ్బును తిరిగి సంబంధిత వ్యక్తికి ఇచ్చేస్తుండడం విడ్డూరం. ఠాగూర్‌ సినిమాలోనూ ఇదే జరిగింది. ఇక్కడ తెలంగాణలోనూ అదే జరుగుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీసు అధికారులు లంచం ఇచ్చినవారి కోసం వెతికి మరీ స్వయంగా వారి ప్లేస్‌లకు వెళ్లి డబ్బులు వాపస్ ఇస్తున్నారు!

సీవీ ఆనంద్‌ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన డిసెంబర్ 24, 2021 నుంచి అక్టోబర్ 12, 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నారు. అడిషనల్‌ డీజీగా ఉన్నా సీవీ ఆనంద్‌కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్ట్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత సీవీ ఆనంద్‌ కొత్త బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏసీబీ డీజీగా ఆయన్ను రేవంత్‌ సర్కార్ నియమించింది.

అయితే.. అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు నిత్యం తలెత్తుతుండడంతో ఆయనను నగర కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. గత ఎన్నికల ముందు వరకు కూడా ఆయన హైదరాబాద్ సీపీగా పని చేశారు. కానీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయనను ఈసీ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆనంద్ ను ఏసీబీ చీఫ్ గా నియమించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను తిరగి హైదరాబాద్ సీపీగా నియమించింది ప్రభుత్వం. ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌ ను నియమించింది. అయితే.. ఆనంద్ వెళ్లిన తర్వాత కూడా ఏసీబీ ఇప్పటి దూకుడునే కొనసాగిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక సీవీ ఆనంద్‌ మంది క్రికెటర్‌ కూడా. భారత్‌ తరుఫున అండర్- 19 టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు ఆనంద్. ఇక హైదరాబాద్ అండర్ - 19, అండర్‌-22 జట్టులో ఆడారు. అటు టెన్నిస్‌లోనూ రాణించారు. అల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ విభాగంలో 8 గోల్డ్ మెడల్స్‌ గెలిచారు. ఇలా అటు క్రీడాలలోనూ ఇటు వివిధ హోదాల్లో పని చేసిన ప్రభుత్వ అధికారిగానూ సీవీ ఆనంద్‌ తనదైన మార్క్‌ చూపిస్తూ ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe