Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు!

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పటేల్ రమేష్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, నగారి గారి ప్రీతం, కాల్వ సుజాతా గుప్తా తదితర నేతలకు పదవులు దక్కాయి.

New Update
Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు!

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి తో పాటు అనేక మంది కీలక నేతలకు పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే మార్చిలోనే ఈ జీఓ సిద్ధం చేసినా.. కోడ్ కారణంగా ప్రభుత్వం విడుదల చేయలేదు. తాజాగా ఈ రోజు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డవలప్మెంట్, కాల్వ సుజాతకు తెలంగాణ స్టేట్ ఆర్య వైశ్య, జనక్ ప్రసాద్ కు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు, ఈరావత్ అనిల్ కు స్టేట్ మినరల్ డవలప్మెంట్, మల్ రెడ్డి రాంరెడ్డికి రోడ్ డవలప్మెంట్ కార్పొరేషన్, బెల్లయ్య నాయక్ కు ఎస్టీ కార్పొరేషన్, నగారిగారి ప్రీతంకు ఎస్సీ కార్పొరేషన్, నిర్మలా జగ్గారెడ్డికి టీఎస్ఐఐసీ, పటేల్ రమేశ్ రెడ్డికి స్టేట్ టూరిజం డవలప్మెంట్ కార్పొరేషన్, రాయల నాగేశ్వరరావు స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు