TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవుల ప్రకటన.. డేట్స్ ఇవే!

తెలంగాణ సర్కార్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవుల ప్రకటన.. డేట్స్ ఇవే!
New Update

TS School Holidays: పండుగలంటే చాలు అందరూ తెగ సంబరపడిపోతుంటారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారు. హాలీడేస్ వస్తాయని ఎగరి గంతులు వేస్తారు. మరి ముఖ్యంగా జనవరి నెల కోసం ఎంతగానో ఎదురుచూస్తు ఉంటారు. ఎందుకంటే న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా వరుసగా సెలవులు వస్తాయని పిల్లలు ఎక్జైటింగ్ గా ఉంటారు. తాజాగా, స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్. జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ను ఇవ్వనున్నట్లు తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

Also Read: కొత్త నేషనల్‌ క్రష్‌కి కొత్త బాయ్‌ఫ్రెండ్‌.. మరి అనుష్క తమ్ముడి సంగతేంటి?

జనవరి 12న ఆప్షనల్ హాలిడే 13వ తేదిన రెండో శనివారం చాలా స్కూళ్లకు ముందుగానే హాలిడే ఉంటుంది. అలాగే 14న భోగి పండుగ,15న సోమవారం సంక్రాంతి రోజున సాధారణ హాలిడే ఉంటుంది. ఇక 16న కనుమ పండుగ కాబట్టి హాలిడే ఉంటుంది. ఇలా వరుసగా 6 రోజుల పాటు సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వం సూళ్లకు సంక్రాంతి సెలవులను డిక్లేర్ చేయడంతో పండగకు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు సిద్ధమవుతున్నారు. ముందుగానే బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దసరా తరువాత తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువుగా జరుపుకునే పండుగా సంక్రాంతి కావడంతో సొంతూళ్లకు రెడీ అవుతున్నారు.

#ts-school-holidays
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe