భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. కొన్ని చోట్ల హైవేలపై నీరు చేరిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. అనేక చోట్ల పంటపొలాలు నీటమునిగాయన్నారు. రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు సాయంత్రం వరకు బయటకు రావొద్దని ప్రజలను మంత్రి కోరారు.
BIG BREAKING: రేపు విద్యాసంస్థలకు సెలవు.. అప్పటి వరకు బయటకు రావొద్దు: మంత్రి పొంగులేటి
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
New Update
Advertisment