/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Indian-Railways-.jpg)
మహబూబాబాద్‌లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేశారు అదికారులు. ఇటీవలి వరదలకు ఇక్కడి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వే 48 గంటల్లోనే తాళ్ల పూసలపల్లి దగ్గర ట్రాక్ ను పునరుద్ధరించింది. వందల మంది సిబ్బందిని, కార్మికులను మోహరించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. ఈ మార్గంలో నిత్యం 82 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ప్రధాన రైల్వే ట్రాక్ ఇదే. దీంతో పాటు నార్త్, సౌత్ ఇండియా మధ్య సైత ఈ రైల్వే లైన్ అత్యంత కీలకం.
Restoration works in full swing by SCR where breaches occurred due to heavy rains. All efforts are being taken up for restoration of train services in the Grand Trunk route section connecting North and South.@drmsecunderabad@drmvijayawadapic.twitter.com/1hwqwbv5UW
— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024
#WATCH | Mahabubabad, Telangana: The restoration works of the railway track between Tadla Pusapalli and Mahabubabad which was washed away on 1st September as a result of heavy rains in the area. pic.twitter.com/NMAlShs3o7
— ANI (@ANI) September 3, 2024
Shri Arun Kumar Jain, General Manager, SCR Inspects
Intakanne – Kesamudram Section to Review Track Restoration Works @RailMinIndia@drmsecunderabad@drmhybpic.twitter.com/b25NLNKsiS— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024
ఇదే మార్గంలో కేరళ ఎక్స్‌ప్రెస్, GT ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్, అండమాన్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రయాణికులు నిత్యం రకపోకలు సాగించే చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సింహపురి, గోదావరి, శాతావాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం ఈ రూట్లోనే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టిన ఇండియన్ రైల్వే ట్రయల్ రన్ ను సైతం పూర్తి చేసింది.