TG Farmer Loan Wavier: రుణమాఫీ కాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి!

తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇటీవల లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. అయితే.. అనేక మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నా.. రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. వారంతా రుణమాఫీ కోసం ఏం చేయాలి? అన్న సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

TG Farmer Loan Wavier: రుణమాఫీ కాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి!
New Update

కొన్ని రోజులుగా తెలంగాణలో ఏ బ్యాంక్ ముందు చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. రుణమాఫీ డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో నిర్ధారించుకునేందుకు బ్యాంక్‌లకు క్యూ కడుతున్నారు. డబ్బులు పడినట్టు మెసేజీ వచ్చినా చాలామంది రైతుల్లో సందేహం మాత్రం అలానే ఉంటుంది. పైగా సంకేతిక సమస్యలతో కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదని సమాచారం. మరోవైపు లక్షల మంది బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌ అయి ఉండడం సంబంధిత రైతుల ఆందోళనకు కారణమవుతోంది. వరుసగా మూడు సంవత్సవరాల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించని ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు!

నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్‌.. అంటే NPAలో లిస్ట్‌ అయిన బ్యాంక్ ఖాతాలను పంట రుణమాఫీ నుంచి మినహాయించడం పలు విమర్శలకు కారణమవుతోంది. NPAలు అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన రుణాలు లేదా అడ్వాన్సులను రుణగ్రహీతలు సకాలంలో చెల్లించకపోవడం. కనీసం 90 రోజుల పాటు వడ్డీలు చెల్లించడంలో విఫలమైన వారిని NPAకింద పరిగణిస్తారు. వారి అకౌంట్లు ఫ్రీజ్‌ అవుతాయి. దీన్నే బ్యాంక్‌ అకౌంట్‌ డెడ్‌ అయ్యిందని అంటుంటారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్ట్‌లో NPA అకౌంట్లు ఉన్న రైతుల పేర్లను తొలగించారని తెలుస్తోంది. తెలంగాణలో ఈ మొత్తంగా 6 లక్షల 90 వేల NPA ఖాతాలు ఉన్నాయి. వీరిపై దాదాపు 4,748 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. నిజానికి గత రెండు సార్లు రుణమాఫీ చేయడానికి NPAను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే రేవంత్‌ సర్కార్‌ మాత్రం ఈ ప్రాతిపాదికన రుణమాఫీ అందించకపోవడంపై బీఆర్‌ఎస్‌ వర్గాలు మండిపడుతున్నాయి.

అయితే ఈ రుణాలు ఇంతలా పేరుకుపోవడానికి కారణం నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 2018 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణమాఫీ చేస్తామని నాడు కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేస్తోంది. అయితే 2023 వరకు ఆ పని చేయలేదని విమర్శిస్తోంది. రుణమాఫీ అవుతుందన్న ధీమాతో చాలా మంది రైతులు వడ్డీలు చెల్లించలేదని చెబుతోంది. ఇలా మూడేళ్ల పాటు ఇంట్రెస్ట్‌ డబ్బులు కట్టకపోవడంతోనే లక్షల మంది రైతుల ఖాతాలు డెడ్‌ అయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.

ఇలా బ్యాంక్‌ ఖాతా డెడ్‌ అవ్వడం వల్ల రుణమాఫీ సాయం పొందలేకపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదు. లోన్ రీపేమెంట్ డిఫాల్ట్ కావడం వల్ల మీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. మీరు సంబంధిత లోన్‌ లేదా వడ్డీ చెల్లించిన తర్వాత ఆ అకౌంట్‌ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. అయితే బ్యాంక్‌ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అందుకే ఇలా అకౌంట్‌ ఫ్రీజ్‌కు గురైన వారు ముందుగా బ్యాంక్‌ అధికారులనే కలవాలి. అకౌంట్‌ ఎందుకు డెడ్‌ అయ్యిందో అధికారులు వివరించిన తర్వాత సంబంధిత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇక అనుమానాస్పద మోసపూరిత కార్యకలాపాల కారణంగా కూడా అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి.


#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe