Telangana: పార్టీ మారితే రోడ్ రోలర్‌తో తొక్కిస్తా.. రేణుకా చౌదరి మాస్ వార్నింగ్..

తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి. ఎవరైనా కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించాలని చూస్తే రోడ్ రోలర్‌తో వారి సంగతి చెబుతానని హెచ్చరించారు.

New Update
Telangana: పార్టీ మారితే రోడ్ రోలర్‌తో తొక్కిస్తా.. రేణుకా చౌదరి మాస్ వార్నింగ్..

Renuka Chowdary: తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రేణుకా చౌదరి.. తెలంగాణ(Telangana)లో మార్పు రావడం తథ్యం అని, కాంగ్రెస్(Congress) జెండా ఎగరడం పక్కా అని అన్నారు. ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలో చేరితే పరిస్థితి ఏంటిన ప్రశ్నించగా.. కాంగ్రెస్ నుంచి పిరాయింపుదారులు ఎలా వెళ్తారో చూస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రోడ్ రోలర్ వేసుకుని హైదరాబాద్‌లోనే కూర్చుంటానని, జంపింగ్ ఆలోచన వస్తే వాళ్ల కథ తేలుస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు రేణుకా చౌదరి. కేసీఆర్, కేటీఆర్ తెలివైన ఆర్థిక నేరస్తులు అని వ్యాఖ్యానించారు రేణుకా చౌదరి. వారి అవినీతి చిట్టాను బయట పెడతామన్నారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారని, అందుకే అధికారం అప్పగిస్తున్నారని పేర్కొన్నారు రేణుకా చౌదరి. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉందన్నారు. క్లిష్టమైన, అతిపెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రమే ఢిల్లీ వరకు వెళ్తామన్నారు రేణుకా చౌదరి. ప్రభుత్వ పాలనంత తెలంగాణ బేస్‌లోనే జరుగుతుందన్నారు. ఢిల్లీ పాలన అంటూ కారు కూతలు కూసే జన ప్రభంజనంలో కొట్టుకుపోయారని బీఆర్ఎస్‌పై సెటైర్లు వేశారు రేణుకా చౌదరి. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు రేణుకా చౌదరి. కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తామని తనకు ఎంతో మంది కాల్ చేస్తున్నారని చెప్పారు రేణుకా.

Also Read:

చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

Advertisment
తాజా కథనాలు