తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది ఎంఐఎం (AIMIM). మొత్తం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇందులో ఆరు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఆరు స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, బహదూర్ పుర, రాజేంద్రనగర్ లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది ఎంఐఎం. ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రేపు లేదా ఎల్లుండి ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఎంఐఎం అభ్యర్థుల లిస్ట్ ఇలా ఉంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: గెలిచినోడు రాజు-ఓడినోడు బానిస: కేసీఆర్ సిద్ధాంతం చెప్పిన రేవంత్
- చార్మినార్ - జుల్ఫేఖర్ అహ్మద్
- చాంద్రాయణ గుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ
- మలక్ పేట్ - అహ్మద్ బలాల
- నాంపల్లి - మాజిద్ హుస్సేన్
- కార్వాన్ - కౌజర్ మోహినుద్దిన్
- యాకుత్పుర - జాఫర్ హుస్సేన్ మీరజ్
అయితే అజారుద్దీన్ పోటీ చేసే జూబ్లీహిల్స్ స్థానంలోనూ పోటీ చేస్తామని సంచలన సృష్ఠించారు అసదుద్దీన్. ఇది బీఆర్ఎస్ కు మేలు చేయడానికే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్రనగర్ లోనూ ఎంఐఎంకు గట్టి ఓటు బ్యాంక్ ఉంది. కాకపోతే అక్కడ గెలిచే స్థాయిలో వారి బలం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఎంఎంఐ పోటీ చేయడం ద్వారా గెలుపోటములను ప్రభావితం అవుతాయని చెబుతున్నారు.