Nalgonda Elections: నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?

నల్గొండ నియోజకవర్గంలో ఈసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ కంచర్ల భూపాల్ రెడ్డి పోరు హోరా హోరీగా సాగుతోంది. మొదటిసారి కోమటిరెడ్డిని ఓడించిన కంచర్ల.. ఈసారి కూడా విజయం తనదే అంటున్నారు. మరోవైపు కంచర్ల పని ఖతం అని కోమటిరెడ్డి వర్గం చెబుతోంది.

Nalgonda Elections: నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?
New Update

Nalgonda Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో హోరాహారి పోరు సాగనుందని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు నేతలూ బలమైన నేతలే కావడంతో.. ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులతో ఎవరి వ్యూహాలు చేస్తున్నారు. ఫలితంగా ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నుంచి నేతల జంపింగ్స్ ఎక్కువైపోయాయి. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్తున్నారు ద్వితీయ శ్రేణు నేతలు. ఇది బరిలో నిలిచన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి జయాపజయాలను ప్రభావితం చేయనున్నాయి. అందుకే.. తమ తమ వర్గంలోని నేతలు లైన్ దాటకుంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కంటెస్టెంట్స్.

నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు నేతలిద్దరూ. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నేతలిద్దరూ. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రత్యర్థి వర్గం కేడర్‌ను తనవైపు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. కోమటిరెడ్డి అనుచరులను తనవైపు లాగేందుకు యత్నిస్తున్నారు కంచర్ల. ఇలా ఇద్దరి ప్రయత్నాలతో నల్లగొండ రాజకీయ మరింత రసకందాయంగా మారింది.

Also Read: పటేల్‌ రమేష్‌ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!

పార్టీల పరంగా, అనుచరగణం పరంగా.. ధనబలం పరంగా ఇద్దరికి ఇద్దరూ ఉద్ధండులే కావడంతో.. హోరా హోరీగా పోటీ నెలకొంది. ఈ ఇద్దరు నేతలు మూడోసారి పోటీ పడుతున్నారు. ఈసారి కోమటిరెడ్డిదే విజయం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. రెండోసారి విజయం తమదేనని కంచర్ల వర్గం ప్రచారం చేస్తోంది.

బలాబలాలు..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేయని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమయంలో చేయడం.. ఆయనకు ప్లస్‌ పాయింట్‌గా కనిపిస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మారిన నల్లగొండ రూపురేఖలు, సీఎం కేసీఆర్ కంచర్ల బలంగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూప్ తగాదాలు తమకు అనుకూలంగా మారుతాయని కంచర్ల వర్గం భావిస్తోంది.

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకసారి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడం ఆయనకు ప్లస్ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి స్థిరమైన ఓటు బ్యాంకు బలంగా ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. బీఆర్ఎస్‌ కోల్డ్ వార్ కూడా తమకు కలిసి వస్తుందని కోమటిరెడ్డి వర్గం భావిస్తోంది.

ఇదీ నల్లగొండ అసెంబ్లీ పరిధి..

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్‌, మాడుగులపల్లి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో నేతలిద్దరికీ సమాన బలం ఉంది. దాంతో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

గత ఎన్నికల ఫలితాలు..

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపాల్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై 10,547 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2018లో మళ్లీ వీరిద్దరూ తలపడ్డారు. అయితే, భూపాల్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డిపై కంచర్ల భూపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏకంగా 23,689 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ పోటీ చేస్తుండటంతో.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

Also Read: నాడు తండ్రులు.. నేడు తనయులు.. సాగర్‌ కా షేర్ ఎవరు?!

#telangana-elections-2023 #telangana-elections #nalgonda-politics #kancharla-bhupal-reddy-and-komatireddy-venkat-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe