TPCC Chief Revanth Reddy: ఎంఐఎం, బీఆర్‌ఎస్‌కి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.. ముస్లిం నేతలతో రేవంత్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం(AIMIM)కు ఓటేస్తే బీజేపి(BJP)కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తోందని, కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్(BRS) మద్దతు తెలుపడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

New Update
TPCC Chief Revanth Reddy: ఎంఐఎం, బీఆర్‌ఎస్‌కి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.. ముస్లిం నేతలతో రేవంత్ కీలక వ్యాఖ్యలు..

TPCC Chief Revanth Reddy: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. తన చేతల్లో వేడి.. మాటల్లో వాడి స్పష్టంగా కనిపిప్తోంది. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ వైపు లాగేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా పలువురు ముస్లిం నేతలను కలిసిన రేవంత్ రెడ్డి.. ముస్లింలకు కాంగ్రెఎస్ అండగా ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, ఎంఐఎంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం(AIMIM)కు ఓటేస్తే బీజేపి(BJP)కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తోందని, కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్(BRS) మద్దతు తెలుపడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నోట్ల రద్దు, అవిశ్వాస తీర్మానం, సీఏఏ, ఎన్ఆర్‌సీ, ట్రిపుల్ తలాక్ బిల్లు, జీఎస్‌టీ బిల్లు సహా పలు అంశాల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

మైనార్టీలను మోసం చేస్తున్న ఎంఐఎం..

బీఆర్ఎస్, ఏఐఎంఐఎం మిత్రపక్షాలని.. ఈ రెండు పార్టీలో బీజేపీతో సమాంతర స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. 50 లక్షల మంది ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఎంఐఎం గత కొన్ని దశాబ్దాలుగా మైనారిటీ కమ్యునిటీని మోసం చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మైనారిటీ సమాజం ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఇబ్బందులు పడుతుంటే.. ఎంఐఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు రేవంత్. ఓల్డ్ సిటీలో పెరుగుతున్న నిరక్షరాస్యత రేటు, అధిక నిరుద్యోగిత, మౌలిక వసతుల కొరత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 'బీఆర్‌ఎస్, ఎంఐఎం నాగపూర్(ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం) మీదుగా ఢిల్లీకి చేరుకుంటాయి. కాంగ్రెస్ మాత్రం నేరుగా ఢిల్లీకి వెళ్తుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

బోగస్ సర్వే..

ఓల్డ్ సిటీకి మెట్రో అని చెప్పి మాయమాటలతో ముస్లి సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీ మెట్రో సర్వే కోసం డ్రోన్స్ సర్వే పేరుతో డ్రామాలాడారని అన్నారు. గూగుల్ మ్యాప్స్ చూస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.

మైనారిటీ డిక్లరేషన్ కోసం సూచనలు కోరిన రేవంత్..

కాగా, సియాత్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్‌, ఇతర ప్రముఖులను కలిసి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 'కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్'లో చేర్చే అంశాలలు, సంక్షేమ పథకాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజల నాడిని గుర్తించేది జర్నలిజం అని, సియాసత్ డైలీ వంటి పత్రికలు రాష్ట్రంలో మైనారిటీల సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తుందని అభినందించారు.

కాంగ్రెస్ నేతల పర్యటన..

కాంగ్రెస్ లౌకిక వాదం కోసం పోరాడుతుందన్నారు టీపీసీసీ చీఫ్. భిన్నత్వంలో ఏకత్వమే దేశ సమగ్రతను, దేశ సమైక్యతను కాపాడుతుందన్నారు. వివిధ జాతుల సంస్కృతులు, విభిన్న వర్గాల ప్రజలు కలిసి జీవించడమే దేశం గొప్పతనానికి నిదర్శనమని కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లౌకిక వాదంపై దృఢమైన విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దేశంలోని 50 మంది అగ్రనేతలు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేస్తామని, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్..


Aslo Read: Twitter War: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్

Advertisment
తాజా కథనాలు