Ponguleti: పొంగులేటికి ఊహించని షాక్.. ఆ ముగ్గురి మాటే నెగ్గిందా?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. సత్తుపల్లి, వైరాలో తాను సూచించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లను ప్రకటించింది. సత్తుపల్లిలో రేణుకా చౌదరి మాట నెగ్గగా.. వైరాలో భట్టి, రేవంత్ సూచించిన అభ్యర్థికి టికెట్ దక్కింది.

Ponguleti: పొంగులేటికి ఊహించని షాక్.. ఆ ముగ్గురి మాటే నెగ్గిందా?
New Update

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivas Reddy)  కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న విడుదల చేసిన మూడో లిస్ట్ లో ఆయన అనుచరులకు మొండి చేయి చూపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, అశ్వరావు పేట, సత్తుపల్లి, వైరా స్థానాల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని మొదటి నుంచి పొంగులేటి పట్టుపడుతున్నారు. ఇందులో ఆయన చెప్పినట్లుగా ఇల్లందు నుంచి కోరం కనకయ్య, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణకు అవకాశం కల్పించింది అధిష్టానం. కానీ, సత్తుపల్లి, వైరా స్థానాల విషయంలో మాత్రం మొండిచేయి చూపింది. సత్తుపల్లి టికెట్ ను రేణుకా చౌదరి సూచించిన మట్టా రాగమయికి కేటాయించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల

వైరా టికెట్ ను మాలోత్ రాందాస్ నాయక్ కు ఇచ్చింది. దీంతో సత్తుపల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఆయన అనుచరుడు కొండూరు సుధాకర్ కు నిరాశే మిగిలింది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరకముందే.. వైరా నుంచి తన మద్దతుతో విజయాభాయి పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమెకు ఆ పార్టీ నుంచి టికెట్ కన్ఫామ్ అన్న టాక్ నడిచింది.

పొంగులేటి కూడా విజయాబాయి టికెట్ కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. రాందాస్ కు సీఎల్పీ నేత భట్టితో పాటు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా రాందాస్ పేరు చెప్పడంతోనే హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల

అయితే.. ఖమ్మం జిల్లా కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట్ టికెట్ కు పటేల్ రమేశ్ రెడ్డి, తుంగతుర్తిలో పిడమర్తి రవి పేర్లను పొంగులేటి సూచిస్తున్నారు. ఇందులో సూర్యాపేట విషయంలో రేవంత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా.. తుంగతుర్తి విషయంలో విభేదిస్తున్నారు. తుంగతుర్తికి సంబంధించి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ వైపు ఉన్నారు. ఈ రెండు టికెట్లను కాంగ్రెస్ ఇంకా ఫైనల్ చేయలేదు.

#bhatti-vikramarka #telangana-elections-2023 #ponguleti-srinivasa-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe