ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి!

పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయనను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి!

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Khammam Congress) బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ ( Sambhani Chandrasekhar) పార్టీని వీడనున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) చంద్రశేఖర్ కు స్వయంగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చంద్రశేఖర్ ను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంభానిని ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. సంభాని చంద్రశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ దశలో ఆయన ఏపీకి పీసీసీ చీఫ్ కూడా అవుతారన్న చర్చ కూడా సాగింది.
ఇది కూడా చదవండి: Big Breaking: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!

ఆయన సొంత నియోజకవర్గం పాలేరు ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ కు మారిన నాటి నుంచి ఆయన ప్రభావం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తగ్గుతూ వచ్చింది. సత్తుపల్లి నుంచి పోటీ చేసి వరుసగా మూడు సార్లు ఆయన ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు జిల్లాలో తన కంటే జూనియర్ అయిన భట్టి విక్రమార్క ఆధిపత్యం పెరగడంతో పాటు ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి, తుమ్మల పెత్తానం అధికం అవడం కూడా సంభానికి మింగుడు పడడం లేదు.
ఇది కూడా చదవండి: CM KCR: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్

ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదనగా ఉందని, ఇక అవమానాలు భరించలేనని నిన్న ఆర్టీవీకి చ్చిన ఇంటర్వ్యూలో సంభాని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంభానికి అనుచరగణం ఉంది. ఎన్నికల వేళ సీనియర్ నేత పార్టీని వీడడం కాంగ్రెస్ కు కొంత మేర నష్టం చేస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
https://rtvlive.com/cm-kcr-filed-nomination-in-gajwel-here-updates/

Advertisment
Advertisment
తాజా కథనాలు