TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ మారనున్న ఎమ్మెల్యే?

బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందుగా టికెట్ ప్రకటించి బీ ఫామ్ మాత్రం వేరే అభ్యర్థికి ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.

TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ మారనున్న ఎమ్మెల్యే?
New Update

ఎన్నికల షెడ్యూల్ కు ముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ (CM KCR).. నిన్న మరో సంచలన నిర్ణయం తీసకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని మార్చారు. ముందుగా ప్రకటించిన అబ్రహంను కాదని విజయుడికి బీఫామ్ ఇచ్చారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయుడైన విజయుడు బీఫామ్ అందుకున్నారు. దీంతో అబ్రహం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి గుడ్ బై చెప్పాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Telangana Elections: కొడంగల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు

ఈ మేరకు తన అనుచరులతో సమావేశమైన అబ్రహం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఏ పార్టీలోకి వెళ్లాలనే అంశంపై ఆయన తన అనుచరులతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రంలోపు ఆయన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలంపూర్ టికెట్ ను అబ్రహంకు ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ఆయన ఈ మేరకు ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో చల్లా ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్ తనకు బీఫామ్ ఇవ్వలేదని అబ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అబ్రహంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చల్లా వర్గం చెబుతోంది. ఆయన పోటీ చేస్తే ఓటమి ఖాయమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అభ్యర్థిని మార్చారని చల్లా వర్గీయులు చెబుతున్నారు. కాగా.. అలంపూర్ నుంచి కాంగ్రెస్ కీలక నేత సంపత్ పోటీలో ఉన్నారు.

#telangana-elections-2023 #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe