Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.. అలాగే బీజేపీలో (BJP) రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీకి పలువురు కీలక నేతలు రాజీనామా చేయగా తాజాగా మరో బీజేపీ నేత ,మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం(Ex-MLA Mrityunjayam) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ALSO READ: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం!
కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన అనంతరం మృత్యుంజయం మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ (BRS Party) ప్రభుత్వాన్ని కూకటి వెళ్ళతో పెకిలించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎన్నికల తరువాత ఒకరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండడానికి లేదని పేర్కొన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని పేర్కొన్నారు. హామీల నెరవేర్చకుండా అవినీతి సామ్రాట్ అయ్యారని ఫైర్ అయ్యారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అవినీతి కేసీఆర్ చేశారని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నానని.. మోదీ (Modi) ,అమిత్ షా (Amit Shah) కేసీఆర్ (KCR) అవినీతి గురించి చెప్తారు.. కానీ చర్యలు తీసుకోరని మండిపడ్డారు.
ALSO READ: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ (ED) , ఐటీ రైడ్స్ (IT Rides) చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒకటే అని ఆరోపించారు. ఆరెండు పార్టీలను కులగొట్టేది కాంగ్రెస్ మాత్రమే అని తేల్చి చెప్పారు.