Telangana Elections: వామ్మో ఇంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? టాప్‌లో రేవంత్, రాజాసింగ్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌పై 89 చొప్పున కేసులు ఉన్నాయి. బండి సంజయ్‌పై 55 కేసులు ఉన్నాయి. కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8, ఈటల రాజేందర్‌పై 40 కేసులు ఉన్నాయి.

Telangana Elections: వామ్మో ఇంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? టాప్‌లో రేవంత్, రాజాసింగ్..!
New Update

Criminal Cases on Telangana MLA Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో 119 నియోజకవర్గాల్లో మొత్తం మంది 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు.. బీఎస్‌పీ, జనసేన సహా ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అయితే, ఎవరి పోటీ ఎలా ఉన్నా.. నామినేషన్ల సమయంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్లు ఇప్పుడు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఈ అఫిడవిట్లు, ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 226 మందికి నేర చరిత్ర ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కూడా వెల్లడించారు. అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలను మాత్రమే ఆయన వెల్లడించారు.

ఈ వివరాల ప్రకారం.. 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 58 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 84 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. బీజేపీలో 78 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంఐఎం పార్టీలో 12 మంది పోటీ చేస్తుంటే.. ఆరుగురిపై కేసులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కేసుల పరంగా కాంగ్రెస్‌లోనే ఎక్కువగా కేసులు ఉన్న అభ్యర్థులు ఉన్నారు. ఆ తరువాత బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ఉన్నాయి.

పార్టీల వారీగా అభ్యర్థులపై ఉన్న కేసులు ఇవీ..

కాంగ్రెస్

👉 టీపీసీ చీఫ్, కొడంగల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డిపై 89 కేసులు.

👉 ఖానాపూర్ అభ్యర్థి వెడ్మ భోజ్జుపై 52 కేసులు.

👉 మంచిర్యాల అభ్యర్థి ప్రేమ సాగర్ రావుపై 32 కేసులు.

👉 కరీంనగర్ అభ్యర్థి పి. శ్రీనివాస్ 24 కేసులు.

👉 సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డిపై 20.

బీజేపీ

👉 గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ పై 89 కేసులు.

👉 కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌పై 59 కేసులు.

👉 బోథ్ అభ్యర్థి సోయం బాపురావుపై 55 కేసులు.

👉 హుజూరాబాద్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 40 కేసులు.

👉 దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావుపై 27 కేసులు.

బీఆర్ఎస్

👉 కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 10 కేసులు.

👉 గజ్వేల్, కామారెడ్డి అభ్యర్థి కె. చంద్రశేఖర్ రావుపై 9 కేసులు.

👉 సిరిసిల్ల అభ్యర్థి కె.టి. రామారావుపై 8 కేసులు.

ఏఐఎంఐఎం

👉 చంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీపై 6 కేసులు ఉన్నాయి.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

#telangana-elections-2023 #telangana-latest-news #telangana-election-updates #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe