Telangana: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..

తెలంగాణలో ఆదివారం వైన్స్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైన్ షాప్స్, బార్లు, క్లబ్స్, బెల్ట్ షాప్స్ అన్నీ బంద్ చేయాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Telangana: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..
New Update

Wine Shops Closed in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్స్ బంద్ చేయాలని ఆదేశించింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని వైన్ షాప్స్, బార్‌లు, క్లబ్‌లు బంద్ చేయాలని ఆదేశించింది ఈసీ. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నొటిఫికేషన్ జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

కౌంటింగ్ సెంటర్లకు మూడంచెల భద్రత..

ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Also Read:

మరో మూడేళ్లు కేసీఆర్ఏ సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

అకౌంట్‌లోకి రూ. 10 లక్షలు.. సంచలన విషయాలు వెల్లడించిన బర్రెలక్క..

#telangana-election-counting #wine-shops-closed-on-sunday
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe