తెలంగాణ కాంగ్రెస్ లో పటాన్ చెరు టికెట్ పంచాయితీ తారా స్థాయికి చేరింది. ఇప్పటికే నీలం మధు ముదిరాజ్ కు (Neelam Madhu) పార్టీ టికెట్ కేటాయించింది. అయితే.. ఇప్పటివరకు అక్కడ పని చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ఆయన అనుచరులు ఏకంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి ఎదుట ధర్నా చేశారు. పటాన్ చెరు టికెట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేవారు. కాట శ్రీనివాస్ గౌడ్ కు (Kata Srinivas Goud) టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన అనుచరుడైన కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇప్పించుకోవడానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: తుమ్మల నివాసంలో సోదాలు.. ఎంత దొరికిందంటే?
నీలం మధుకు టికెట్ ఇప్పించడంలో జగ్గారెడ్డి ప్రమేయం కూడా ఉందని టాక్ నడుస్తోంది. దీంతో ఈ రోజు ఉదయం ఆయన హైకమాండ్ కు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పటాన్ చెరు టికెట్ మారిస్తే నా నిర్ణయం నేను తీసుకుంటానని హైకమాండ్ పెద్దలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరో వైపు కచ్చితంగా పటాన్ చెరు టికెట్ మార్చాల్సిందేనని దామోదర రాజనర్సింహ పట్టుపడుతున్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల్లో ఎవరి మాట నెగ్గుతుంది? పటాన్ చెరు టికెట్ మారుస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నీలం మధు వైపు ఉన్నట్లు తెలుస్తోంది.