ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరిన ఈ తరుణంలో బీజేపీ (BJP) కీలక నేత విజయశాంతి (Vijayashanthi) మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో మంచి పాపులారిటీ కలిగిన విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఆమె పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. నిత్యం ట్విట్టర్ ద్వారా పార్టీకి నష్టం కలిగిలేలా పోస్టులు పెడుతున్న విజయశాంతిపై బీజేపీ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆమెకు చోటు ఇవ్వలేదన్న ప్రచారం ఉంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ రఘునందన్ రావు పేరుతో కలిపి రెండో లిస్ట్ లో ఆమె పేరును ప్రకటించారు. అయినా.. రాములమ్మ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఆందోళన కమిటీకి కూడా ఆమెను చైర్మన్ గా ప్రకటించింది బీజేపీ. అయితే.. ఆ కమిటీ మీటింగ్ ను కూడా విజయశాంతి నిర్వహించలేదు. దీంతో రాములమ్మ ను కాషాయ పార్టీ లైట్ తీసుకుందన్న చర్చ సాగుతోంది. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారతామంటే తామేమీ చేస్తామని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లోకి విజయశాంతి వస్తారని గతంలో మల్లు రవి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అయితే మల్లు రవి వ్యాఖ్యలపై సైతం విజయశాంతి స్పందించలేదు. అయితే.. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. విజయశాంతి ఇంకా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమేంటో తెలియక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.