నీళ్లు జగన్ కు.. నిధులు మెఘా కృష్ణారెడ్డికి: కేసీఆర్ పై రేవంత్ నిప్పులు

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు జగన్, నిధులు మెఘా కృష్ణారెడ్డి, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలు అయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డిసెంబర్ 3 తర్వాత రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.

New Update
నీళ్లు జగన్ కు.. నిధులు మెఘా కృష్ణారెడ్డికి: కేసీఆర్ పై రేవంత్ నిప్పులు

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తర్వాత రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ (KCR) ఫ్యామిలీకి చర్లపల్లి జైలులో డబల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 30 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఫలితంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ నినాదాలకు నీళ్లు వదిలారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నీళ్లు జగన్, నిధులు మెఘా కృష్ణారెడ్డి పాలయ్యాయయని ధ్వజమెత్తారు. ఒక్క కేసీఆర్ ఇంట్లోనే నియామకాలు జరిగాయని నిప్పులు చెరిగారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్‎కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా!

మనవడిని మంత్రిని చేయడం కోసమే కేసీఆర్ మూడో సారి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ గడ్డపై పేదల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్ గడీలోకి పేదలకు ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు పేదల చెమట వాసన తెలియదన్నారు. అమరవీరుల కుటుంబాలను ప్రగతిభవన్ లోనికి రానివ్వలేదన్నారు. ఆఖరికి ప్రగతభవన్ వద్దకు వెళ్లిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను మూడు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టి అవమానించారన్నారు.

తెలంగాణకు పట్టిన చీడను వదిలించే బాధ్యత యువకులపై ఉందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మూరెడు లేడు కానీ మూసిని మింగిండన్నారు. జగదీశ్ రెడ్డికి మంత్రి పదవి కేసీఆర్ సారాలో సోడా కలిపేందుకేనని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.

Advertisment
తాజా కథనాలు