Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. వారికిదే నా సవాల్: గాదరి కిషోర్

తుంగతుర్తిలో తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు రెండింతలు అయ్యాయన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అంటూ ధ్వజమెత్తారు.

New Update
Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. వారికిదే నా సవాల్: గాదరి కిషోర్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ (Gadari Kishore Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు కల్లు తాగిన కోతుల మాదిరిగా ఎగురుతారని ఎద్దేవా చేశారు. ఇసుక మీద తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు వారు నిరూపించినా పోటీ నుంచి తప్పుకుంటాన్నారు. నిరూపించకుంటే మీరు తప్పుకుంటారా? అని కోమటిరెడ్డి బ్రదర్స్ కు సవాల్ విసిరారు. ఇసుక, మట్టి అమ్ముకుంటూ కాంట్రాక్టులు చేసుకునేది వారేనంటూ ధ్వజమెత్తారు. తాను కష్టపడి చదువుకుని, ఉద్యమం చేసి పైకి వచ్చాన్నారు. తుంగతుర్తిలో తన హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు మరో రెండింతలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దిక్కు లేరన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంట్రాక్టుల బిల్లుల కోసమే నాడు కాంగ్రెస్ నేతలు కాల్వలు తొవ్వించారని ధ్వజమెత్తారు. మెత్తటి మట్టి వచ్చిన దగ్గర తొవ్వి.. బండ ఉన్న దగ్గర వదిలేశారని ఆరోపించారు. ఆనాడు నీళ్లు లేకున్నా.. వారు కాల్వలు ఎందుకు తీశారు? అని ప్రశ్నించారు.

తుంగతుర్తి ఇంకా మంచిగ కావాలంటే మళ్లీ ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ, స్కామ్ లు అంటూ విమర్శలు గుప్పించారు. గాదరి కిషోర్ ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు