Telangana elections 2023: రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ భారీ స్కెచ్‌!

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన బడా లీడర్లను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మొత్తం 25 బహిరంగ సభలు ప్లాన్ చేయగా.. అందులో మోదీ 5 సమావేశాల్లో ప్రసంగించనున్నారని సమాచారం. హైదరాబాద్‌ రోడ్‌ షోలోనూ మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అటు అమిత్ షా 8-10 సమావేశాలకు జేపీ నడ్డా కనీసం 10 సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

New Update
Telangana elections 2023: రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ భారీ స్కెచ్‌!

తెలంగాణ ఎన్నికల్లో(Telangana elections) గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. దక్షిణాదిన ఇప్పటికే కర్ణాటకను కోల్పోయిన బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి రావాలని తన అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. బీజేపీ టాప్‌ లీడర్లు రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. బీజేపీ బిగ్‌-3గా పేరున్న ప్రధాని మోదీ(Modi), హోం మంత్రి అమిత్‌ షా(Amit shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda) ఎన్నికల ప్రచార బరిలోకి దూకుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 25 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే నెల(నవంబర్‌)30న ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వస్తాయి.

Also Read: ఆ యజమానుల వివరాలు ప్రకటించాల్సిందే..!

బరిలోకి బిగ్‌-3:
తెలంగాణలో 25 బహిరంగసభలకు బీజేపీ ప్లాన్‌ చేయగా.. ఉమ్మడి పది జిల్లాల్లో మోదీ బహిరంగ సభలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షోకి కూడా బీజేపీ ప్రణాళిక రచించినట్లుగా సమాచారం. అటు అమిత్‌ షా 8 నుంచి 10 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇక నడ్డా సైతం 10 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రులు ప్రచారం చేయనున్నారు. నవంబర్‌ మొదటి వారంలో మోదీ తెలంగాణలో ల్యాండ్‌ అవ్వనున్నారని సమాచారం. నడ్డా కూడా ఫస్ట్ వీక్‌లోనే ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అటు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కూడా ప్రచారంలోకి తీసుకురానుంది బీజేపీ. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తోంది. అటు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ సమీపంలో బీసీ గర్జన సభను భారీగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ ఇప్పటికే సీనియర్ నేత ఈటల రాజేందర్‌ పేరును ఖరారు చేసింది.

బీసీ గర్జనతో చెక్‌ పెడతారా?
తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి బీసీల ఓట్లు కీలకం. మోదీ స్వయంగా బీసీ కావడంతో బీసీ గర్జన సభకు ప్రధానిని ముఖ్య అతిథిగా పిలిచి ఆయన స్పీచ్‌ ఇచ్చేలా బీజేపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అందులో బీసీ గణన విషయంలో మోదీ సర్కార్‌ తీరుపై బీసీ వర్గాల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం ఉంది. అధికారంలోకి వస్తే బీసీ గణన చేపట్టి.. సంఖ్య ఆధారంగా రిజర్వేషన్‌ను పెంచుతామని కాంగ్రెస్‌ బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీసీ గణనకు పూనుకున్నామని.. తెలంగాణలో కూడా గెలిచిన వెంటనే అదే చేస్తామని ఇటీవలి తెలంగాణకు వచ్చిన రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అటు బీఆర్‌ఎస్‌ సైతం బీసీ గణన విషయంలో ప్రస్తుతం మౌనం వహిస్తోంది. దీంతో బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్తాయంటూ హస్తం నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే బీసీ గర్జనతో ఈ కులం ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు.. ఈటల సీరియస్, కొండా అలక.. అసలేమైందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు