Harish Rao: 'ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది'.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్! ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు మంత్రి హరీశ్‌రావు. కర్ణాటక రైతులు అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. ఉద్యమకారులుపై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీశ్‌రావు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అంటూ కొనియాడారు హరీశ్‌రావు. By Trinath 24 Oct 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ నేతలు తమ మాటలకు పదును పెడుతున్నారు. టైమ్ చూసుకోని ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామంలో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యంను కలిసి పార్టీలో కలిసి పనిచేయాలని కోరిన మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అదేశానికి కట్టుబడి ఉండి చింతా ప్రభాకర్‌తో కలిసి ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ జెండా పాతుతామని పట్నం మాణిక్యం హామీ ఇచ్చారన్నారు హరీశ్‌రావు. పార్టీ మాణిక్యంను, అనుచరులను కాపాడుకుంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పట్నం మాణిక్యంకు పార్టీ మంచి అవకాశం కల్పిస్తోందని తెలిపారు. Also Read: ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ! హరీశ్ రావు ఇంకేం అన్నారంటే: ➼ తెలంగాణ పాల పిట్ట కేసీఆర్. ➼ దసరా రోజు పాలపిట్టను శుభంగా ఎలా అయితే చూస్తారో తెలంగాణకు కేసిఆర్‌ను అంతే శుభంగా ప్రజలు చూస్తారు. ➼ కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శం ➼ కేసీఆర్ ఒకవైపు... తెలంగాణ ద్రోహులు అందరూ ఒకవైపు ➼ ఉద్యమకారులు పై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారు. ➼ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షం. ➼ పక్క రాష్ట్రాలకు వెళితే ప్రజలు కాంగ్రెస్ , బీజేపీ పాలన గురించి చెబుతారు. ➼ కర్ణాటక రైతులు ప్రభుత్వాలను తిట్టుకుంటుర్రు. ➼ పక్క రాష్ట్రానికి పోతే అర్థం అయితది. ➼ విమర్శిస్తే వెంట తీసుకెళ్ళండి. ➼ ఇక్కడ పథకాలు అక్కడ ఉన్నాయా? ➼ మతం మంటలు.. ఇదే కాంగ్రెస్ చరిత్ర. ➼ ఈ పదేళ్లలో తెలంగాణలో కరువు లేదు, ➼ కేసీఆర్ అభివృద్ది చూసి పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. ➼ దేశంలో కరెంటు కోతలు. ➼ నాణ్యమైన కరెంటు ఉన్నది తెలంగాణలోనే ➼ రైతుల దగ్గర వసూళ్లు చేసే ప్రభుత్వాలను చూశాం. ➼ ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా? ➼ వేరే ప్రభుత్వాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగారు. మళ్ళీ అదే వ్యవస్థ వస్తె ప్రజలు ఊరుకుంటారా..? రైతుల ఉసురు పోసుకుంటారా...? ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేదని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు హరీశ్‌రావు. 69 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని.. కొన్ని లోపాలు ఉంటే సరి చేస్తామన్నారు. రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడు అన్నారని.. ఇపుడు మేం చేసింది కంప్యూటరీకరణ కాదా అని ప్రశ్నించారు. ఎవరూ ఎన్ని మాట్లాడినా హ్యాట్రిక్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీశ్‌రావు. Also Read: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ! #telangana-elections-2023 #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి