BREAKING: షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంపులో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఆయనతో పాటు కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాంరెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

New Update
BREAKING: షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు పెరిగిపోతున్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా ఆ పార్టీ అగ్రనేత తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షాద్‌నగర్‌లో అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాంరెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరారు.

publive-image షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి (ఫైల్)

చౌలపల్లి ప్రతాప్ రెడ్డి... 2009లో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని షాద్‌నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతాప్‌రెడ్డి ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడారు. హస్తం గూటి నుంచి గులాబీ గూటికి చేరారు. ఇక రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తోంది. షాద్‌నగర్‌ రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి . ఇది మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం . 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన అంజయ్య యాదవ్ విజయం సాధించారు.

షాద్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఫరూఖ్‌నగర్, కొందుర్గ్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, చౌదర్‌గూడ మండలాలున్నాయి.
షాద్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఫరూఖ్‌నగర్, కొందుర్గ్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, చౌదర్‌గూడ మండలాలున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి... ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం అన్నారు. మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదని.. కుటుంబ అనుబంధమన్నారు రాహుల్. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందని చెప్పారు. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్ మేం ఎక్కడ బీజేపీతో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోందన్నారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై కేసులు పెట్టారని తెలిపారు. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని. ఇల్లు లేకుండా చేశారని.. తనకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ... కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరన్నారు రాహుల్ గాంధీ.

Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు