Telangana elections 2023: ఎమ్మెల్యేల సీట్ల విషయంలో బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. పాపం ఇది అతనికి తెలీదు!

సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్. తమ లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిందని.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్ళిందని ఆరోపించారు సంజయ్. పెద్ద సర్ ఆమోదం కోసం లిస్ట్ వెయిట్ చేస్తున్నదంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదంటూ సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు బకరా అంటూ కామెంట్స్ చేశారు.

New Update
Telangana elections 2023: ఎమ్మెల్యేల సీట్ల విషయంలో బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. పాపం ఇది అతనికి తెలీదు!

తెలంగాణ ఎన్నికలు(Telangana elections) సమీపిస్తుండడంతో మాటల మంటలు రాజుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్‌(Congress) నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయంగా ఇప్పటికే రంజుగా మారింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్(Bandi sanjay) తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ సీట్లను నిర్ణయించేది కేసీఆర్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అడ్డా మీది కూలీలను తెచ్చి కండువా వేస్తున్నది బీఅర్‌ఎస్ అంటూ ఫైర్ అయ్యారు. మోదీ బీఅర్‌ఎస్ బండారాన్ని బయట పెట్టారని విమర్శించారు. బీఅర్‌ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారన్నారు బండి సంజయ్‌. దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు.

బండి సంజయ్ ఏం అన్నారంటే?

➼ సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

➼ మా లిస్ట్ ఢిల్లీకి వెళ్ళింది.

➼ కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్ళింది

➼ పెద్ద సర్ ఆమోదం కోసం లిస్ట్ వెయిట్ చేస్తుంది.

➼ పాపం ఈ విషయం రేవంత్‌కి తెలీదు.

➼ కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ వచ్చే అవకాశం లేదు

➼ వీరిద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుంది

➼ అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

➼ కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు

➼ కేటీఆర్ ముఖం చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు

బకరాలు వారే:
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావుకు తనదైన శైలీలో చురకలంటించారు బండి సంజయ్. రేవంత్, హరీశ్‌ ఇద్దరూ బలిచ్చె బకరాలని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో బలిచ్చే బకరా రేవంత్ అయితే బీఆర్‌ఎస్‌లో హరీశ్‌ రావు అని వెటకారంగా మాట్లాడారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కేటీఆర్ ముఖం చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కేసిఆర్‌పై ప్రజల విశ్వాసం కోల్పోయారని తెలిపారు. ప్రజలనే కాదు ఆఫీసర్స్‌ను సైతం నమ్మలేని స్థితిలో కేసిఆర్ ఉన్నారన్నారు ఈటెల. అందుకే స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్‌ను కేసీఆర్‌ నియమించినట్టు తెలిపారు. కేసిఆర్ అంగట్లో సరుకుల్ల నాయకులను కొంటున్నారని ఆరోపించారు. నాయకుడి స్థాయిని బట్టి రెట్ అంటగడుతున్నరన్నారు. దానికోసమే ప్రత్యేకంగా డబ్బులు కేటాయించినట్లు సమాచారం ఉందని ఆరోపించారు ఈటెల. అధికారులు జీతగళ్ళల కేసిఆర్ చేసిన పనులు చేస్తే వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కేసిఆర్ ఒక్కొక్క నియోజక వర్గంలో 30 నుంచి 100కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ALSO READ: వారి పేర్లు దుర్వినియోగం అయ్యే ఛాన్స్.. తెలంగాణ ఓటర్ల లిస్ట్‌లో చనిపోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు