రానున్న తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి పోటీ చేయనున్న 52 మంది అభ్యర్థులతో బీజేపీ ఈ రోజు ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లిస్ట్ లో కీలక నేతల పేర్లు లేకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) పేరు లేకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా బరిలో ఉంటారా? లేక ఎంపీగా వెళ్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. వివేక్ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే.. హైకమాండ్ మాత్రం చెన్నూరు నుంచి వివేక్ పేరును లిస్ట్ లో ఉంచినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: YS Sharmila: షర్మిల బిగ్ ట్విస్ట్.. పొంగులేటి సూచనతో అక్కడి నుంచి పోటీకి సై?
దీంతో వివేక్ అభ్యంతరం తెలపడంతో లిస్ట్ నుంచి ఆయన పేరును ఆఖరి నిమిషంలో తొలగించినట్లు టాక్ నడుస్తోంది. అయితే, వివేక్ కు ట్విస్ట్ ఇస్తూ ధర్మపురి నుంచి ఎస్ కుమార్ కు టికెట్ కేటాయిస్తూ మొదటి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. దీంతో వివేక్ చెన్నూరు నుంచి పోటీ చేస్తారా? లేదా పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? అన్న అంశంపై బీజేపీలో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పోటీకి దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వివేక్ కూడా పోటీ చేయకపోతే ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న టెన్షన్ కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!
ఇదిలా ఉంటే.. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలా? లేదా? అన్న విషయంలో కోమటిరెడ్డి ఇంకా తేల్చుకోలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.