TS Elections 2023: తెలంగాణ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు.. ముఖ్యనేతలతో సోనియా మీటింగ్! తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సోనియా గాంధీ ముఖ్య నేతలతో సమావేశమై పలు సూచనలు చేశారు. అసంతృప్తులపై ఓ కన్నేసి ఉంచాలని రాష్ట్ర పీసీసీకి ఆదేశాలు పంపిచినట్లు తెలుస్తోంది. By Nikhil 16 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ (Congress) హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పార్టీ గెలిచే వాతవారణం ఏర్పడిందని భావిస్తున్న హైకమాండ్ ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా సోనియా గాంధీ (Sonia Gandhi) రంగంలోకి దిగారు. సీనియర్ నేతలతో చర్చించి తగు సూచనలు చేస్తున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. అసంతృప్తులపై ఓ కన్నేసి ఉంచాలని రాష్ట్ర పీసీసీకి (TPCC) ఆదేశాలు పంపించారు. ఇది కూడా చదవండి: TS Elections 2023: ఈ 8 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ వారే.. కానీ పార్టీలే మారే! ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల బలాబలాలపై కూడా సోనియా చర్చించినట్లు సమాచారం. వారికి దీటుగా వ్యూహాలను రూపొందించాలని ఆదేశించినట్లు సమాచారం. గెలుపోటములను నిర్ణయంచే ముఖ్యమైన 40 స్థానాల లిస్టు ను రూపొందించిన హైకమాండ్ ఎప్పటికప్పుడూ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులపై సమీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సోనియాతో వర్చువల్ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని, KC వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ రానున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో అన్ని జిల్లాలను చుట్టేసేలా అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. #sonia-gandhi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి