సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ (Chintha Prabhakar) ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీశ్ రావు (Harish Rao) సహకారంతో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఇది కూడా చదవండి: KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్
కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి (Jagga Reddy) పాత విషయాలనే కొత్త తరహాలో మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడని ఫైర్ అయ్యారు. ఈ నెల 27న కేసీఆర్ నియోజకవర్గానికి రానున్నట్లు చెప్పారు. తాను గెలిస్తే సంగారెడ్డికి ఐటీ హబ్ తీసుకువస్తానన్నారు. మియా పూర్ వరకు ఉన్న మెట్రో రైల్ ను సంగారెడ్డి వరకు పొడిగిస్తామన్నారు. డంప్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. చింతా ప్రభాకర్ పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.