పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కొడంగల్ లో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆయన 4,159 ఓట్ల లీడ్ లో ఉండగా.. కామారెడ్డిలో ఫస్ట్ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఆయన 2,354 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీజేపీ కామారెడ్డిలో రెండో స్థానంలో ఉండగా.. సీఎం కేసీఆర్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి: TS Election Results: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న #RevanthReddy.. సీఎం ఆయనేనా?
మరో వైపురాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 65కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయం దిశగా దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ 40 సీట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో కౌంటింగ్ సాగుతుండగా.. అశ్వరావుపేటలో ఓట్ల లెక్కింపు ముగిసింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ఆ పార్టీకి తొలి విజయం అందించారు.