/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Renuka-Chowdary-jpg.webp)
హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అంటూ ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) చేసిన వ్యాఖ్యలు పిచ్చిపట్టిన మాటలని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (Renuka Chowdary) అన్నారు. ఆయన ఓటమి ఖాయమని తాను 6 నెలల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. ఆర్టీవీకి ఈ రోజు రేణుకా చౌదరి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని టీడీపీ పోటీ నుంచి తప్పుకుందన్నారు. ఇంత మంది అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడడం చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. అనుకోని పరిస్థితుల్లో కొందరికీ సీట్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:Eatela Rajender: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు
సంభాని చంద్రశేఖర్ లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోవడం బాధ కలిగించిందన్నారు. వారిని పిలిచి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోతే పోనీ అంటూ సీనియర్ల మనోభావాలు దెబ్బతినేలా అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశం ఇతర పార్టీల వారికి అవసరం లేదన్నారు. విజయం కోసం ఫైట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేణుకా చౌదరి పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియలో చూడండి.
Follow Us