/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kcr-bus-jpg.webp)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధం అయ్యింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ బస్సును పంపించారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరిన ఈ బస్సు ఇవాళ్టి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాద్‌కు ఈ ప్రచార రథం రానుంది.
మరోవైపు సీఎం కేసీఆర్ ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. కేసీఆర్ ఇవాళ్టి(అక్టోబర్ 15) షెడ్యూల్ ఇదే:
తెలంగాణ భవన్
11 గంటలకు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..
పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజక వర్గాల ఇంచార్జ్ లతో సమావేశం.
పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేయనున్న గులాబీ బాస్.
ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం.
అనంతరం 12.15 నిమిషాలకు మ్యానిఫెస్టో విడుదల ,మ్యానిఫెస్టోపై ప్రసంగం.
తెలంగాణ భవన్ లొనే పార్టీ అభ్యర్థులు, ఇంచార్జి లతో మద్యాహ్న భోజనం చేయనున్న చంద్రశేఖర్ రావు.
అనంతరం ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్.
4.50 కి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో హుస్నాబాద్ బయల్దేరి వెళ్లనున్న కేసీఆర్.
హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచార శంఖారావం సభకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు
మరోవైపు కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సంబంధిచి బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో.. అక్టోబర్ 17న సిద్దిపేట, సిరిసిల్ల.. అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు.
ALSO READ: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?