BREAKING: తెలంగాణలో ముగిసిన పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్‌లో నమోదైంది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే 65 శాతం పోలింగ్ నమోదు కాగా.. తుది లెక్కలు వచ్చే సమయానికి ఆ సంఖ్య 80 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆందోళన వ్యక్తం అయ్యింది. అలర్ట్ అయిన టెక్నికల్ బృందాలు సమస్యను పరిష్కరించడంతో అంతా ఊపిరి పీల్చారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకుంది. హైదరాబాద్‌లో ఓటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఈ పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ ను డిసెంబర్ 3న నిర్వహించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు