Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే అర్బన్ ఏరియాల్లో కాస్త నెమ్మదిగా మొదలైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగ గుర్తించగా ఇక్కడ 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో 4 గంటలవరకే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పిన అధికారులు నిర్దేశించిన సమయంలో పోలింగ్ బూత్ కు రానివారిని లోపలికి అనుమతించలేదు. క్యూ లైన్ లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు.
Also read : మెట్రోపై ఎన్నికల పండుగ ఎఫెక్ట్.. బోసిపోయిన బోగీలు
సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో గంట ముందే ముగిసిన పోలింగ్ నిలిపేశారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. అయితే 4 గంటలవరకే ఓటు వేసే అభ్యర్థులు సెంటర్ కు చేరుకోవాలని, నిర్దేశించిన సయంలో రానివారిని లోపలికి అనుమతించట్లేదని పోలీసులు తెలిపారు.
ఇక ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు పన్నెండు వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించగా ఈ యేడాది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు 9.99 లక్షల మంది కావడం విశేషం. మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో 600 పోలింగ్ స్టేషన్లున్నాయి. ఇందులో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.