TS Elections 2023: హస్తానిదే హవా..? పోల్‌ ట్రాకర్‌ సర్వే ఫలితాలు ఇవే..!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని 'పోల్ ట్రాకర్‌' సర్వే చెబుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి 64 నుంచి 71 వరకు ఓట్లు వస్తాయని.. అటు బీఆర్‌ఎస్‌కు 39-43 సీట్లు వస్తాయని సర్వే రిజల్ట్ చెబుతోంది. 28 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 1,54,851 మంది అభిప్రాయాలను తెలుసుకుంది.

New Update
కాంగ్రెస్‎తో క్రామేడ్లు కటీఫ్..? ఇదే కారణమంటోన్న సీపీఐ..!!

ఎన్నికల టైమ్‌ దగ్గరపడుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతున్నాయి, మాటాల తూటాలు సంధిస్తున్నాయి. మరోవైపు సర్వేలు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. నియోజకవర్గాల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారో లెక్కలు కడుతున్నాయి. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేలు బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టగా.. తాజాగా రిలీజైన 'పోల్‌ ట్రాకర్‌ సర్వే(Poll Tracker Survey)' హస్తానిదే హవా అంటోంది. తెలంగాణలో ఎన్నికల విజేత కాంగ్రెసేనని చెబుతోంది.

కాంగ్రెస్‌కు ఎంత శాతం అంటే:
అక్టోబర్‌ 1-28 మధ్య పోల్‌ ట్రాకర్‌ తెలంగాణలో సర్వే చేసింది. ఈ సర్వేలో మొత్తం 1,54,851 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయనున్నారో అడిగింది. 28 రోజుల పాటు జరిగిన ఈ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఈ సర్వే చెబుతోంది. మొత్తంగా కాంగ్రెస్‌కు 64 నుంచి 71 వరుకు ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. అటు బీఆర్‌ఎస్‌కు 39 నుంచి 43 వరకు సీట్లు వస్తాయట. శాతాల పరంగా చూస్తే కాంగ్రెస్‌కు 43శాతం, బీఆర్‌ఎస్‌కు 34శాతం ఓట్లు పోల్‌ అవుతాయని సర్వే ఫలితాలు అంచనా వేస్తున్నాయి.

publive-image పోల్ ట్రాకర్ సర్వే ఫలితాలు

సింగిల్ డిజిట్:
అటు బీజేపీకి మాత్రం ఏ సర్వే చూసినా ఆశించిన సీట్లు రావడం లేదు. అది ఆత్మసాక్షి అయినా పోల్‌ ట్రాకర్‌ అయినా బీజేపీ అసలు డబుల్‌ డిజిట్‌ మార్క్‌ను టచ్ చేయడం లేదు. బీజేపీ 5-6 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆత్మ సాక్షి సంస్థ సర్వే చెప్పగా.. పోల్‌ ట్రాకర్‌లో అంతకంటే తక్కువ సీట్లే వస్తాయని రిజల్ట్ వచ్చింది. బీజేపీకి 3 నుంచి 5 సీట్లు వరుకే వస్తాయని పోల్‌ ట్రాకర్‌ ఓపినియన్‌ పోల్‌ చెబుతోంది. 10శాతం ఓట్లు పోల్‌ అవుతాయట. మరోవైపు MIMకు 2 నుంచి 5 సీట్లు వస్తాయని.. 10శాతం ఓట్లు పోల్‌ అవుతాయని పోల్‌ ట్రాకర్‌ సర్వే చెబుతోంది.

Also Read: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేల లెక్కలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు