/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mission-Chanakya-jpg.webp)
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ ఎన్నికలకు (TS Elections 2023) సంబంధించి మిషన్ చాణక్య (Mission Chanakya) సంస్థ ఈ రోజు తమ సర్వే ఫలితాలను విడుదల చేసింది. 44.62 శాతం ఓట్లతో మరో సారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలోకి రానున్నట్లు తన సర్వే ఫలితాల్లో పేర్కొంది మిషన్ చాణక్య. కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇతరులకు 5.07 శాతం ఓట్లు వస్తయని తమ సర్వేలో వెల్లడైందని మిషన్ చాణక్య అధినేత శివకేశవ్ తెలిపారు. ఇంకా సీట్ల లెక్కల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ పార్టీ 70-76 సీట్లను గెలుచుకుంటుందని మిషన్ చాణక్య అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ జపం.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TS-Survay-jpg.webp)
కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది మిషన్ చాణక్య. బీజేపీ 9 సీట్లలోపే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. అయితే.. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని మిషన్ చాణక్య సర్వే తెలిపింది. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుస్తాడంటూ ముందే చెప్పింది మిషన్ చాణక్య.
మిషన్ చాణక్య సర్వే ప్రకారం
బీఆర్ఎస్ - 70 నుండి 76 సీట్లు
కాంగ్రెస్ - 25 సీట్లు
బీజేపీ - 9 సీట్లు గెలిచే అవకాశం ఉంది #MissionChankyaSurvey #TelanganaElections #TelanganaElection2023 #TelanganaElections2023 pic.twitter.com/cmR5P1kNI4— Telugu Scribe (@TeluguScribe) October 22, 2023
కానీ.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మిషన్ చాణక్య సర్వే అంచనాలు తారుమారయ్యాయి. ఈ సర్వే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని అంచనా వేసింది. కానీ.. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఈ సారి మిషన్ చాణక్య సర్వే చెప్పిన లెక్కలు నిజమవుతాయా? లేదా? అన్నది తేలాలంటే డిసెంబర్ 3న కౌంటింగ్ పూర్తయ్యే సమయం వరకు ఆగాల్సిందే!