చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాయని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల పేరుతో మరీ ఎక్కువ చేస్తున్నారని.. అసలైన ఫలితాలు తమకు గుడ్ న్యూస్ అందిస్తాయని అన్నారు.

New Update
IT Minister KTR :ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు

KTR Tweet: తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్‌ పై (Telangana Exit Polls) చర్చలుకొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు తెలపగా. మరికొన్ని సర్వే సంస్థలు తెలంగాణలో హంగ్ వస్తుందని అంటున్నాయి. సర్వేలు ఎన్ని చేసిన అసలైన తెలంగాణ ఫలితాలు తెలియాంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి ఉండాలి.

ALSO READ: ‘అధికారం మనదే’.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలపై కేటీఆర్ (KTR) స్పందించారు. రబ్బిష్‌.. న్యూసెన్స్‌ అంటూ పోలింగ్‌ ముగిసిన అనంతరం స్పందించారు. తాజాగా మళ్లీ ట్విటర్‌లో.. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతదాకా అయినా వెళ్లొచ్చు, కానీ.. కచ్చితమైన ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే అర్థం వచ్చేలా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండ కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని కొందరు కామెంట్లు చేయగా.. రానున్న రోజుల్లో మీకు నిద్ర లేకుండా పోతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి తెలంగాణ పగ్గాలను ఏ పార్టీ చేజిక్కించుకుంటుందో వేచి చూడాలి.

ALSO READ: సాగర్ వివాదంపై ఏపీ సర్కార్‌ కు కేఆర్ఎంబీ లేఖ.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు