Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే!

ఈ 9ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌ ఓ నెటిజన్‌కు ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చాడు. వాయిదా పడిన లేదా రద్దు చేసిన అన్ని పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించడం తమ ప్రధాన ప్రాధాన్యతనని చెప్పుకొచ్చారు.

Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే!
New Update

'నీళ్లు, నిధులు, నియామకాలు..' ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడకముందు కేసీఆర్‌(KCR) ఎక్కువగా ఉపయోగించిన పదాలు ఇవే. ఈ మూడిటిపై కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కొత్త రాష్ట్రంలో వీటిపైనే ఎక్కువగా ఫోకస్‌ ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 9ఏళ్లు గడిచిపోయింది. ఈ తొమిదేళ్లూ కేసీఆరే సీఎంగా ఉన్నారు. అయితే చాలా సందర్భాల్లో నియామకాల విషయంలో కేసీఆర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా TSPSC పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఇదే అస్త్రాన్ని ఉపయోగించి బీఆర్‌ఎస్‌ను కార్నర్‌ చేస్తుంటాయి. ఈ సారి కూడా ఉద్యోగాల విషయమే ప్రత్యర్థి పార్టీలకు మెయిన్ పాయింట్. అయితే తాజాగా తెలంగాణలో కొత్త జాబ్స్‌ లెక్కలపై కేటీఆర్‌(KTR) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.


మిమ్మల్ని నమ్మవచ్చా?
కేటీఆర్‌ను ట్యాగ్‌ చేసి పృథ్వీరాజ్ అనే యూజర్‌ ఈ విధంగా క్వశ్చన్‌ అడిగాడు. 'సార్, ఎన్నికల ముందు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. TSPSC ఔత్సాహికులకు ఉద్యోగ క్యాలెండర్‌ను అందజేస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు? మేం విశ్వసించగలమా?' అని కేటీఆర్‌ను ట్యాగ్‌ చేయగా.. ఆయన రిప్లై ఇచ్చారు. 100శాతం నమ్మకంగా ఉన్నామంటూ కేటీఆర్‌ సమాధానం చెప్పారు. 9 సంవత్సరాలలో 1.6 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. ఏ కొత్త రాష్ట్రం కూడా ఇన్ని జాబ్స్ ఇవ్వలేదన్నారు. వాయిదా పడిన లేదా రద్దు చేసిన అన్ని పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించడం తమ ప్రధాన ప్రాధాన్యతనని చెప్పుకొచ్చారు. త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌తో ముందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. మా చర్యలు మా మాటలకు అనుగుణంగా ఉన్నప్పుడు.. మీరు మమ్మల్ని నమ్ముతారని.. ఈ విషయం మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుందని బదులిచ్చారు.


ఇక కేటీఆర్‌ ట్వీట్‌కు రిప్లైగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా ట్వీట్లు చేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్‌ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలను ఇస్తే.. బీఆర్‌ఎస్‌ ఏడాదికి 25వేల జాబ్స్‌ను ఫిల్ చేసిందని బీఆర్‌ఎస్‌ సపోర్టర్స్ ట్వీట్‌ చేస్తున్నారు. దేశంలో 9 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సొంత గూటికి తుల ఉమ.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

#brs #ktr #telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe