Barrelakka Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీష.. మరో సంచలనానికి తెరలేపారు. నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడెట్‌గా పోటీ చేస్తున్న శిరీష్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గంలోని ఊరు వాడా తిరుగుతూ ప్రచారం సాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి తనకు వస్తోన్న అనూహ్య సపోర్ట్‌తో శిరీష్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. అటు సోషల్ మీడియాలో.. ఇటు క్షేత్ర స్థాయిలో తన సత్తా చాటుతోంది. తొలుత లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు సైతం.. నేడు ఆమెను చూసి భయపడుతున్నారు. ఇటీవల ఆమెపై, ఆమె తమ్ముళ్లపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ విషయం ఇలా ఉంటే.. తాజాగా శిరీష తన మేనిఫెస్టోని విడుదల చేసింది. 7 ప్రధానాంశాలుగా పేర్కొంటూ హామీపత్రం విడుదల చేసింది బర్రెలక్క. మరి ఆమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలేంటో ఓసారి చూద్దాం..
బర్రెలక్క మేనిఫెస్టో..
1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా.
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు - ఫ్రీ కోచింగ్
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్
Also Read:
కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..