కాంగ్రెస్ మూడో లిస్ట్‌లో (Congress 3rd List) ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయని సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం టికెట్ ను జలగం వెంకట్రావుకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సీపీఐతో పొత్తు కుదరకపోతే వెంటనే వెంకట్రావును చేర్చుకుని కొత్తగూడెం టికెట్ ఇచ్చేలా ప్లాన్ తో సిద్ధంగా ఉంది హస్తం పార్టీ. ఖమ్మం జిల్లాలో ముఖ్యనేతలుగా ఉన్న పొంగులేటి, భట్టి, రేణుకా చౌదరి తమ వారికే టికెట్లు ఇప్పించుకోవాలన్న లక్ష్యంతో హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సత్తుపల్లి సీటుపై పునరాలోచించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సూర్యాపేట సీటు విషయంలోనూ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Vivek: ఇక పర్మినెంట్ గా కాంగ్రెస్ లోనే ఉంటా.. అక్కడి నుంచే పోటీ చేస్తా: వివేక్
ఈ టికెట్ కోసం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా దామోదర్ రెడ్డితో వెంకట్ రెడ్డి చేయి కలిపినట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. పటేల్ రమేష్‌రెడ్డి కోసం రేవంత్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సూర్యాపేట విషయంలో దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి మాట నెగ్గితే ఆ ప్రభావం తుంగతుర్తి సీటుపై కూడా పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!
ఇదే జరిగితే ఈ ఇద్దరి అగ్ర నేతల ఉమ్మడి శత్రువు అయిన అద్దంకి దయాకర్ కు తుంగతుర్తి టికెట్ దక్కే అవకాశమే ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు వంశీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కామారెడ్డి సీటుకు సంబంధించి రేవంత్‌రెడ్డితో పాటు మరో కొత్తపేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.