/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Bhavan-jpg.webp)
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ (BRS) నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ (KTR) హాజరుకానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. అయితే.. రేపు ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఈసీ స్క్వాడ్ ఈ కార్యక్రమంపై అభ్యంతరం తెలిపింది. అయితే.. ఇది ఎన్నికల ప్రచార కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించడం, మరో పైపు బీఆర్ఎస్ శ్రేణుల రాకతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..