Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు!

ఎగ్జిట్‌పోల్స్‌ పేరిట పలు సంస్థలు ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇస్తే.. మరో సంస్థ బీఆర్‌ఎస్‌కు 70సీట్లు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు!
New Update

అక్కడ పోలింగ్‌ స్టేషన్‌ నుంచి జనాలు బయటకే రాలేదు.. సాయంత్రం 5గంటల 30నిమిషాలు అయ్యిందో లేదో వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ దర్శనమిచ్చాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరుకే అయినా అప్పటికీ క్యూ లైన్‌లో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతించారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన రూల్. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ అర్థరాత్రి వరకు సాగింది. ఈలోపే 'ఇండియా టూడే' మినహా మిగిలిన చాలా సర్వేల ఎగ్జిట్‌ పోల్స్ వచ్చేశాయి. ఒకదానికి మరొకదానికి పొంతన లేదు. అడ్డదిడ్డంగా నంబర్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అసలు MIM ఊసే లేదు. అంటే మీనింగ్ ఏంటి? MIMకి ఒక సీటు కూడా రాదని అర్థమా? ఒక ఎగ్జిట్ పోల్‌కి మరో ఎగ్జిట్‌ పోల్‌కి 30లు, 40లు నంబర్స్‌ తేడా ఎలా ఉంటుంది? ఒక ఎగ్జిట్‌ పోల్‌ బీఆర్‌ఎస్‌కు 70 ఇస్తే.. మరో ఎగ్జిట్ పోల్‌ కాంగ్రెస్‌కు 70 ఇచ్చి పడేసింది. జనాలు వెర్రోళ్లా? పిచ్చోళ్లా?

నిజానికి ఎగ్జిట్ పోల్స్‌ అంటే పోలింగ్ స్టేషన్‌ల నుంచి ఓటర్లు బయటకు వెళ్లేటప్పుడు సంబంధిత వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రక్రియ. కొన్ని ప్రశ్నల ద్వారా ఎవరికి ఓటు వేశారో తెలుసుకుంటారు. డెమోగ్రాఫిక్స్‌తో పాటు ఏ బూత్‌లో ఏ కులం, మతం, ప్రాంతానికి చెందిన ఓటర్లు ఉంటారు లాంటి వాటిని ఎంపిక చేసుకొని సర్వే చేస్తారు. ఈ సర్వే ద్వారా ఓవరాల్‌గా ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి.. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు లాంటివి తెలుస్తాయని నిపుణులు చెబుతుంటారు. మొత్తం ఎన్నికల ట్రెండ్‌లను అంచనా వేయడానికి డేటాను విశ్లేషిస్తారు. అయితే ఇది కచ్చితమైన రిజల్ట్ ఇవ్వదు. ఎగ్జిట్ పోల్స్‌ చాలా సార్లు బోల్తా పడ్డాయి. గత వెస్ట్ బెంగాల్‌ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్స్‌ బకెట్‌ తన్నాయి. బీజేపీకి భారీ మెజారిటీ విక్టరీ ఇస్తాయని ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ మమత బెనర్జీ ప్రవాహానికి కొట్టుకుపోయి ఇసుకలో కూరుకుపోయాయి. అయినా కూడా జనాలకు ఎగ్జిట్ పోల్స్‌ అంటే అదో ఇంట్రెస్ట్.. అదో ఎక్సైట్‌మెంట్..!

publive-image

శాంపిల్స్‌ సేకరిస్తున్నారా?
చాలా మంది శాంపిల్స్‌ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అసలు శాంపిల్స్‌ సేకరించకుండానే ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్స్‌ను పలు సంస్థలు ఇష్టారీతిన రిలీజ్ చేస్తున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై ఒకసారి లుక్కేస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.. ఇండియా టీవీ-CNX ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్‌కు తెలంగాణలో 63-79 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 31-47, బీజేపీకి 2-4 సీట్లు, అసదుద్దీన్‌ పార్టీ AIMIM 5-7 సీట్లు గెలుస్తాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న విషయం తెలిసిందే. అదే సమయంలో న్యూస్ 24-టుడేస్ చాణక్య సర్వే దీనికి పూర్తి భిన్నమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను రిలీజ్ చేసింది. కాంగ్రెస్‌ 71 సీట్లు గెలుచుకోవచ్చని, బీఆర్‌ఎస్‌ 33 సీట్లు సాధిస్తుందని అంటోంది. బీజేపీకి 7 సీట్లు, ఇతరులకు 8 సీట్లు వస్తాయని ఈ సంస్థ చెబుతోంది. ఇలా ఒకరు బీఆర్‌ఎస్‌కు 70 ఇస్తే.. మరొకరు కాంగ్రెస్‌కు 70ఇచ్చారు. ఇది కాస్త 70-70 గేమ్‌గా మారింది. ఇటు జనాలకు కూడా క్యూరియాసిటీ ఎక్కువ.. ఎవరు గెలుస్తారన్నదానిపై ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులేమో వారికి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ నిజమని వాదిస్తుండగా.. ఇటు కాంగ్రెస్‌ సపోర్టర్స్‌ ఏమో తమ పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను చూపించుకుంటున్నారు. దీంతో ఇక్కడ నిజాలు-అబద్ధాలు కాకుండా వెర్షన్లు-ప్రాపగండాలు మాత్రమే కనిపిస్తున్నాయని అర్థమవుతోంది. అందుకే హ్యాపీగా రిజల్ట్‌ డే వరకు వెయిట్ చేసి ఎవరు గెలిచారో తెలుసుకుంటే బెస్ట్!

Also Read: ‘ఇందిరాను B***H, ఇండియన్స్‌ను BA*****S..’ హెన్రీ ఇంకా లేరు!
WATCH:

#telangana-elections-2023 #exit-polls
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe