డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల కమిషన్ సస్సెన్షన్ వేటు వేసింది. ఈ రోజు ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందన్న వార్తలు వచ్చిన కొద్ది సేపటికే డీజీపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ ఇలా రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు వేసినట్లు సమాచారం. అదనపు డీజీలు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: మా విజయం అమరవీరులకు అంకితం:రేవంత్ రెడ్డి !
ఈసీ షాక్.. డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే పీసీసీ చీఫ్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పిన డీజీపీ అంజనీ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
New Update
Advertisment