Telangana Elections 2023: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? డోంట్ వర్రీ డౌన్‎లోడ్ చేసుకోండిలా...!!

తెలంగాణ ప్రజలకు సూపర్ డూపర్ బంపర్ ఛాన్స్. ఈ అవకాశం మళ్లీ ఐదేళ్ల తర్వాతే వస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ మిస్సవ్వకుండా ఓటు వేయాలి. ఓటు వేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. మీకు ఓటర్ స్లిప్ అందకుంటే (https://tsec.gov.in/home.do లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.

Telangana Elections 2023: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? డోంట్ వర్రీ డౌన్‎లోడ్ చేసుకోండిలా...!!
New Update

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఓట్ల పండుగ. ఆ రోజు ఓటర్లంతా ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు..రాజకీయ పార్టీల నేతలు కూడా ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. నకిలీ ఓట్లను తొలగించేస్తున్నారు. కొత్త ఓట్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఓటర్ స్లిప్ లను ఓటర్లకు పంచే ప్రక్రియ శనివారం పూర్తయ్యింది. ఎన్నికల సిబ్బంది, ఇంటింటికీ వెళ్లి, ఓటర్ స్లిప్పులను ప్రజలకు అందిస్తున్నారు. ఒకవేళ మీకు ఆ స్లిప్ అందనట్లయితే...మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్లిప్ తీసుకుని ఓటు వేయోచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ స్లిప్ తో ప్రయోజనం ఏంటి?
మనదగ్గర ఓటర్ ఐడీ ఉంటుంది...మనం ఓటు వేయ్యోచ్చు. మరి స్లిప్ తో పనేంటి అనుకుంటున్నారా? మనం ఉండే ఏరియాలో 4 లేదా 5 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మమ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఆ పోలింగ్ బూత్ ఎక్కుడుంది అనేది మనకు తెలియాలంటే ఓటర్ స్లిప్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ స్లిప్పులో వివరాలన్నీ ఉంటాయి. మనం ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఓటర్ ఐడీ కార్డు లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుతోపాటు ఈ స్లిప్ కూడా తీసుకెళ్తే తొందరగా ఓటు వేసి బయటకు రావచ్చు.

ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోండిలా:
-తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ https://tsec.gov.in/home.do లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.
-మీకు టాప్ లో voter portal అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
-మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో లెఫ్ట్ సైడ్ పేరు ఆధారంగా ఓటర్ స్లిప్ ను సెర్చ్ చేయండి అనే అప్షన్ కనిపిస్తుంది. అలాగే ఎపిక్ ఐడీ ఆధారంగా ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోండి

ఈ ఆప్షన్స్ ద్వారా మీరు మీ ఓటర్ స్లిప్ తీసుకోవచ్చు. మీరు ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నప్పుడు జిల్లా, అర్బన్ లోకల్ బాడీ, వార్డ్, ఎపిక్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడీ స్లిప్ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతుబంధు.. సర్కార్ కీలక నిర్ణయం!

#telangana-elections-2023 #telangana-assembly-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe