Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఎప్పుడనే అంశంపై ఉత్కంఠ ఇంకా వీడడం లేదు. చేరికలు, కమ్యూనిస్టులకు సీట్ల కేటాయింపు అంశం ఇంకా కొలిక్కిరాకపోవడంతో సీట్లను ఖరారు చేయలేకపోతోంది హస్తం పార్టీ. తెలంగాణ బీజేపీ (Telangana BJP) కీలక నేతలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిచకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: కోమటిరెడ్డి మీద బూర నర్సయ్య పోటీ?
రాజగోపాల్ రెడ్డి కోసం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతనే ఆ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: హాట్ టాపిక్‌గా జంపింగ్ జపాంగ్‌లు.. బీజేపీ బతుకు బస్టాండ్ చేశాడుగా..!
రేపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మరో వైపు రేపే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అనంతరం ఈ నెల 26న సెకండ్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సెకండ్ లిస్ట్ విడుదల తర్వాత ప్రజల్లోకి వెళ్లి తమ మేనిఫెస్టోను వివరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.