TS Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల అత్యవసర భేటీ.. ఆ నేతలు మాట వింటారా? రెబల్స్ తో నామినేషన్లను విత్ డ్రా చేయించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ కు గట్టి రెబల్ అభ్యర్థులు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. అయితే.. వారు బుజ్జగింపులకు వింటారా? అన్న అంశంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. By Nikhil 14 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Election Updates: తెలంగాణలో నామినేషన్ల విత్ డ్రాకు రేపటి వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఆఖరి నిమిషంలో అనేక టికెట్లను ఖరారు చేసిన హస్తం పార్టీకి (TS Congress) రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. టికెట్ దక్కకపోవడంతో నాగం జనార్దన్ రెడ్డి, ఎర్ర శేఖర్, మానవతారాయ్, సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిపోయారు. మరికొందరు మాత్రం పోటీలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నంలో పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దీంతో పాటు మొత్తం 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి రెబల్స్ ఉన్నట్లు గుర్తించారు అగ్రనేతలు. దీంతో వారిని బుజ్జగించేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఇది కూడా చదవండి: Kishan Reddy: రంగంలోకి కిషన్ రెడ్డి.. బీజేపీలోకి నవీన్ యాదవ్? మహేశ్ కుమార్ గౌడ్, మాణిక్ రావు ఠాక్రే, విష్ణునాథ్ తదితరులు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి తిరుగుబాటు అభ్యర్థులతో చర్చిస్తున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని.. రానున్న రోజుల్లో తగిన అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే.. సూర్యాపేట అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి మాత్రం నామినేషన్ ను ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన రమేశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: Telangana Elections: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా? బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల కన్నా ముందుగానే దాదాపు అందరు అభ్యర్థులకు లైన్ క్లీయర్ చేసింది. టికెట్ల కోసం పోటీ పడుతున్న వారిని బజ్జగించింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాజయ్యకు రైతు బంధు సమితి చైర్మన్ పదవిని ఇచ్చింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ గా నియమించింది. నర్సాపూర్ లో మదన్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి రెబల్స్ కనిపించడం లేదు. #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి